← Back to news

షాద్‌నగర్ ఉపాధ్యక్షుడిగా రాధాకృష్ణ

By Shirisha Chinthakindi· 46m ago
షాద్‌నగర్ ఉపాధ్యక్షుడిగా రాధాకృష్ణ

TG: బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమితులైన పర్వతాపూర్‌కు చెందిన మీదికేరి రాధాకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేతులమీదుగా రాధాకృష్ణ నియామక పత్రం అందుకున్నారు. బడుగు,బలహీన వర్గాల కోసం మల్లన్న చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు చెప్పారు. జనాభా దామాషా ప్రాతిపదికన రాజ్యాధికారం ప్రజలకు దక్కేలా చైతన్యం కల్పిస్తామన్నారు.

More in Local