← Back to news

అంతర్ జిల్లాల బైక్ దొంగలు అరెస్ట్

By epuri rajaratnam· 22 Aug 2026
అంతర్ జిల్లాల బైక్ దొంగలు అరెస్ట్

AP: అంతర్‌జిల్లాల్లో వరుసగా బై‌క్‌లను టార్గెట్ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలోని ఆత్మకూరు, చినకాకాని గ్రామాలతో పాటు తిరుపతి, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో వాహనాలను చోరీ చేసిన తెనాలికి చెందిన పార్థసారథి, రవికుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు ద్విచక్రవాహనాలను రికవరీ చేసి సీజ్ చేశారు. విచారణలో తెనాలి రూరల్ పరిధిలోని జగ్గడగుంటపాలెంలో ఇంటి దొంగతనాలకు కూడా పాల్పడినట్లు గుర్తించారు.

More in Local