ఈఫిల్ టవర్.. 'బాప్స్' వివాదం?

ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గర కొత్త వివాదం తలెత్తింది. దాన్ని చూసేందుకు "బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ' - బాప్స్ ప్రతినిధుల టీమ్ వెళ్లింది. ఐతే.. వారికి కనిపించకుండా మహిళా సిబ్బందిని పక్కకువెళ్లమని టవర్ నిర్వాహకులు కోరడం వివాదమైంది. దీనిపై సిబ్బంది మండిపడ్డారు. వారి నిరసనలతో టవర్‌ని తాత్కాలికంగా మూసివేశారు. దీనిపై స్పందించిన బాప్స్.. ఈఫిల్ టవర్ అధికారులతో మాట్లాడిన తర్వాతే తమ టీమ్ అక్కడికి వెళ్లిందని చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది.



