భక్తుల ఊరేగింపులోకి దూసుకొచ్చిన ట్రక్.. ముగ్గురు మృతి!
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గమ్మ విగ్రహ ఊరేగింపులోకి వెనుక నుంచి ట్రక్ దూసుకురావడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. బెళగావి నుంచి హుంచ్యానట్టి గ్రామానికి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హట్టరగి టోల్ ప్లాజా దగ్గరలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

