డొంకేశ్వర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సువర్ణ

TG: డొంకేశ్వర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్నారం గ్రామానికి చెందిన సువర్ణ శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఆమెకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగుల బాపూరావు, లిఫ్ట్ చైర్మన్ మోర్తాడ్ రాజారెడ్డి, మాజీ సర్పంచ్ దశ గౌడ్, DCC డెలిగేట్ గంగాసరం సాయన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేస్తానని సువర్ణ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.



