నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులోని పల్లా నాగయ్య నేలబావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బావిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి వయస్సు సుమారు 46 ఏళ్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రావు వెల్లడించారు.


