← Back to news

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు

By dk· 17 Jun 2026· Hmtvlive· నెల్లూరు జిల్లా
విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు

AP: పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు MPDOలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.​ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట MPDO ఏవీ మురళీకృష్ణ, తడ MPDO డీ.శేఖర్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'స్వచ్ఛ రథాల' ఏర్పాటు, వాటి నిర్వహణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమయ్యారని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

More in Local