← Back to news

రూ.110 కోసం దారుణ హత్య

By DK· 9 Jun 2026· Ntnews· హైదరాబాద్‌
రూ.110 కోసం దారుణ హత్య

TG: హైదరాబాద్ లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జైప్రకాష్‌ దేశ్‌ముఖ్‌ హైదరాబాద్‌లో మేస్త్రీ పనులు చేస్తాడు. మోండామార్కెట్‌ ప్రాంతంలో జైప్రకాశ్‌ దేశ్‌ముఖ్‌కు తుకారాంగేట్‌కు చెందిన దాబీ వినోద్‌, అడ్డగుట్టకు చెందిన మక్కల మోహన్‌ పరిచయమయ్యారు. జైప్రకాష్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బు, ఫోన్‌ దోచుకునే ప్రయత్నంలో జైప్రకాష్ ప్రతిఘటించడంతో రాళ్లతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం రూ.110 నగదు, ఫోన్‌ దోచుకుని పరారయ్యారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.