ఏడు గంటల్లో 130 మందిని కరిచిన కుక్క

మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఓ వీధి కుక్క భయంకరంగా ప్రవర్తించింది. సందీప్ హోటల్ నుంచి ఖడక్‌పాడా వరకు ఏడు గంటల్లో సుమారు 125 నుంచి 130 మందిని కరిచింది. వీళ్లంతా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రోగుల్లో ఎక్కువ మంది చికన్‌ఘర్, గోద్రేజ్ హిల్, ఆధర్వాడి, రేతి బందర్ ప్రాంతాలకు చెందినవారు. స్థానిక పోలీసులు, కల్యాణ్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీధి కుక్కను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.


