ACBకి చిక్కిన అధికారులు.. బాణసంచా కాల్చి సంబరాలు

TG: లంచాలకు అలవాటుపడిన ఇద్దరు అధికారులు, వారికి సహకరించిన ఓ అధికారిణి కుమారుడు ACB వలకు చిక్కారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వెంచర్ యజమాని నుంచి రూ.45వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల MPDO పెనుగొండ రాధిక, MPO కిన్నెర యాకయ్యతోపాటు ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జున ACBకి రెడ్ హ్యాండెడ్ దొరికారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీబీ DSP సాంబయ్య తెలిపారు. అధికారుల అరెస్టుతో నర్సింహులపేట మండల ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.



