← Back to news

రూరల్ ఎకానమీకి ఊతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

By DK· 8 Jul 2026· అమరావతి
రూరల్ ఎకానమీకి ఊతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్‌కు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో రైతులను ప్రోత్సహించాలని అధికారులకు CM సూచించారు. రూరల్‌ ఎకానమీని బలోపేతం చేసేలా ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఇథనాల్‌, మీథేన్‌, ఏవియేషన్‌ ఇంధనానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలని సూచించారు.

More in AP