← Back to news

పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్

By DK· 22 Jul 2026· రంగారెడ్డి జిల్లా
పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని విద్యార్థిని సూసైడ్

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో బీటెక్ విద్యార్థిని శ్రేయ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న యువతి, లెక్చరర్స్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. గతంలో పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్ తీసుకెళ్లిన ఘటనతో పాటు, పరీక్షల సమయంలో తనపై పలు అనుమానాలతో కావాలనే నన్ను టార్గెట్ చేశారని పేర్కొంది. తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 15h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.