ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి: TPF

TG: తెలంగాణ బడ్జెట్‌లో విద్యకు కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా Fee Regulation చట్టం తీసుకురావాలని కోరింది. విద్యా కమిషన్ చేసిన 426 సిఫారసుల్లో కనీసం మూడు ముఖ్యమైన అంశాలనైనా ప్రభుత్వం అమలు చేయాలని ఆకునూరి మురళి అన్నారు. ఈ మూడు డిమాండ్లపై ముఖ్యమంత్రికి లేఖ కూడా ఇచ్చామని.. ప్రభుత్వం స్పందిస్తే బస్సు యాత్రను మధ్యలోనే ఆపేస్తామని తెలిపారు.


