నాలా వరదలో కొట్టుకుపోయిన వృద్ధుడు

TG: హైదరాబాద్ మియాపూర్ వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో వరద నీటిలో పడి వృద్ధుడు బాలయ్య గల్లంతయ్యారు. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఆయన ప్రమాదవశాత్తు నాలా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, హైడ్రా, NDRF బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వృద్ధుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.



