← Back to news

రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్

By Dosawada Adithya· 6h ago· Ranga Reddy
రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్

TG: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన షాద్‌నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులకు అడుగు పడిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. రిజర్వాయర్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని, భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేవని స్పష్టం చేశారు.

More in Local