BJP, RSSకి సిగ్గుండాలి: నటుడు
ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నవారిపై హిందుత్వ ఉగ్రవాదులు దాడులు చేసి, వేధించారని నటుడు కిశోర్ ఆరోపించారు. BJP, RSSకు సిగ్గుండాలి, గూండాలను కాపాడుతున్న ఢిల్లీ పోలీసులకు సిగ్గుండాలని చెప్పారు.ఇది గాంధీ దేశం.. దీన్ని గాడ్సే దేశంగా మారనివ్వం అన్నారు. బిల్కిస్ బానో లాంటి వేలాది మందిపై అత్యాచారాలకు పాల్పడినవారు , గర్భిణులు కడుపును కోసి, బిడ్డను బయటకు తీసి చంపి, తన కత్తిపై ట్రోఫీలా మోసుకెళ్లిన భజరంగి వంటి వ్యక్తులూ ఈ మోదీ గ్యాంగ్‌లోని వారేనని అన్నారు. మోదీ, షాల ప్రతి ద్రోహాన్ని గుర్తుంచుకుంటామన్నారు.



