H-1B వీసా రూల్స్ ఛేంజ్

అమెరికాలో H-1B వీసా హోల్డర్స్‌కి ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చే ఆలోచనలో ఉంది. జాబ్ పోయిన తర్వాత ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే యూఎస్ విడిచి వచ్చేయాల్సి ఉంటుంది. అమెరికాలోని H-1B వీసా హోల్డర్స్‌లో 71% మంది భారతీయులే కావడంతో మనవాళ్లపై దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.



