← Back to news

నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

By Digamber Adla· 2d ago
నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

TG: నిర్మల్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకీ షర్మిళ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లౌడ్‌స్పీకర్లు, డీజేల వినియోగంపైనా ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 9h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.