← Back to news

గిడుగు రామ్మూర్తి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

By Anaparthi News· 29 Aug 2026· East Godavari

AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు భాషను ప్రజల వాడుక భాషగా తీర్చిదిద్దేందుకు గిడుగు రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన భాషా సేవలను నేటి తరానికి పరిచయం చేయడంతోపాటు, గిడుగు ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

More in Local