← Back to news

విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!

By Adithya· 10h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్‌లో ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తమ కూతురి బంధువు రమేష్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. దీంతో పోలీసులు రమేష్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అధ్యాపకుల వేధింపుల ఆరోపణలతో ఇంగ్లీష్ లెక్చరర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కొత్త ఆరోపణలతో విచారణ మరో కోణంలో సాగుతోంది. ఈ కేసులో నిందితులెవరనేది తేలాల్సి ఉంది.

More in Local