← Back to news

భార్యతో గొడవ.. పిల్లలతో ప్రాజెక్టులో దూకిన భర్త

By DK· 12 Jun 2026· Ntnews· కామారెడ్డి జిల్లా
భార్యతో గొడవ.. పిల్లలతో ప్రాజెక్టులో దూకిన భర్త

TG: భార్యతో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ (32), సవిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రక్షిత్ (8), అనన్య (5) ఉన్నారు. వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై కృష్ణ ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టిన రెస్క్యూ టీమ్.. ముగ్గురి డెడ్‌బాడీలను బయటకు తీశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.