మంత్రి లోకేష్‌ను కోరిన నిరుద్యోగులు

తాజాగా ప్రకటించిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో SI, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న తమకు ఎక్కువ పోస్టులు ఇచ్చి ఛాన్స్ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్.. గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీలను వరుసగా భర్తీ చేస్తున్నామని చెప్పారు. పోస్టుల పెంపు ప్రతిపాదనను పరిశీలించి, అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.



