సెల్ఫీ వీడియో తీసుకొని..యుమునలో దూకి ఆత్మహత్య
UPలోని మథుర జమునాపార్ ప్రాంతానికి చెందిన దినేశ్ యమునా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వీటీ సుపారీ ఫ్యాక్టరీలో 15 ఏళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దూకే ముందు వీడియో తీసుకున్న దినేశ్ ఫ్యాక్టరీ యజమాని మేనల్లుడు చింటూ, సూపర్‌వైజర్ పంకజ్ మూడు నెలలుగా తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. ఏ తప్పూ లేకుండా జాబ్ నుంచి తొలగించాలని చూస్తున్నారని వివరించాడు. కృష్ణపురి వంతెన నుంచి దూకి మరణించాడు.


