నర్సంపేట షాపుల్లో గణేష్ వేడుకలు

వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లోని బిజినెస్ కాంప్లెక్స్‌లు, షాపుల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్‌లో భజనలు, పూజలతో ఆ ఏరియాలన్నీ ఆధ్యాత్మిక శోభతో ఉంటున్నాయి. వ్యాపారులు, స్టాఫ్, కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


