ఉపాధి పనుల దగ్గరే బతుకమ్మ సంబరాలు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో మహిళలు ఉపాధి పనుల దగ్గరే బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అటవీ ప్రాంతంలో తంగేడు పూలను సేకరించి, అందంగా బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ కలిసి ఆడిపాడారు. మహిళల పాటలు, ఆటలతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. తమ సంస్కృతిని చాటుతూ మహిళలు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు.


