← Back to news

మాంట్ ఫోర్ట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు!

By Mirza Hameed Baig· 1h ago· Khammampadu, Madhira, Khammam
మాంట్ ఫోర్ట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు!

ఖమ్మం టౌన్ గుట్టల బజార్ ఏరియాలోని మాంట్ ఫోర్ట్ హైస్కూల్లో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన ఈ పండుగను శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణమంతా పూలతో అలంకరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు రంగురంగుల దుస్తుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మాంట్ ఫోర్ట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు!

More in Local