← Back to news

ఎండకాలంలో ఏ నీళ్లు తాగాలి? చల్లటివా.. వేడివా?

By sahani· 12 Apr 2026· Telugu Report
ఎండకాలంలో ఏ నీళ్లు తాగాలి? చల్లటివా.. వేడివా?

వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల తక్షణ ఉపశమనాన్ని ఇచ్చినా, ఆరోగ్యానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీరే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అదే సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీరైతే రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగుతూ, అదనంగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

More in Health