యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్ల టోకరా
AP: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో ‘ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్’ కంపెనీ తప్పుడు సమాచారంతో విజయవాడ యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్లు మోసం చేసింది. బ్యాంక్ లోన్ వచ్చాక ఆరు నెలల్లో కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఏజీఏం సీబీఐకి ఫిర్యాదు చేశారు. కంపెనీ డైరెక్టర్లు, బ్యాంక్ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు చేపట్టారు.



