← Back to news

బాసరలో పుష్కరాల పనులపై కలెక్టర్ సమీక్ష

By DK· 1h ago
బాసరలో పుష్కరాల పనులపై కలెక్టర్ సమీక్ష

గోదావరి పుష్కరాల సందర్భంగా బాసరలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులన్నింటినీ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి దేవస్థానం ఈవో కార్యాలయంలో పుష్కరాల పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, దుస్తులు మార్చుకునే గదులు, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

More in Local