← Back to news

హనుమాన్ జెండా ఉత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore

గూడూరులో హనుమాన్ జెండా ఉత్సవం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అత్యవసర వాహనాలు మినహా బైక్‌లు, కార్లను పట్టణంలోకి అనుమతించరు. చిల్లకూరు, బొగ్గులదిబ్బ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేసి, ఇతర వాహనాలను సాధుపేట, బనిగిసాహెబ్ పేట, వై జంక్షన్ మీదుగా హైవేకు మళ్లించనున్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని, ఉత్సవాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు కోరారు.

More in Local