నేడు పల్లె పండుగ 3.0

AP: ఆంధ్రప్రదేశ్లో ‘పల్లె పండుగ 3.0’ ప్రోగ్రామ్ ఈ రోజు 2గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కానుంది. నెల్లూరు జిల్లా.. వరికుంటపాడు మండలం.. రామాపురం గ్రామంలో CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్ ఈ ప్రోగ్రామ్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 11,085 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించనున్నారు. ఇందులో రోడ్లు, డ్రైన్లు, మినీ గోకులాలు, గ్రామీణ సదుపాయాల అభివృద్ధి వంటి పనులు ఉన్నాయి.

