← Back to news

గద్దె తొలగించవచ్చు.. ప్రజల గుండెల్లో స్థానం కాదు!

By VIJAY· 9h ago· Nallabelly, Nallabelli, Warangal
గద్దె తొలగించవచ్చు.. ప్రజల గుండెల్లో స్థానం కాదు!

వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను తొలగించారు. ఈ చర్యపై BRS నల్లబెల్లి మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి స్పందించారు. "గద్దె తొలగించొచ్చు.. కానీ ప్రజల గుండెల్లో నేతకు ఉన్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరు" అని ఆయన వ్యాఖ్యానించారు. అనుమతులు, స్థల సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించాల్సిందేనన్నారు. ప్రజానేతల జ్ఞాపకాలను రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local