గంగవరం పోర్టు కాలుష్యం..గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి

AP : విశాఖపట్నం జిల్లాలోని గంగవరం, పెదగంట్యాడ ఊళ్లలో పోర్టు కాలుష్యం వల్ల దుమ్ము పెరిగిపోతోందని, ప్రజలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నామని తెలిపారు. కాలుష్యానికి చెక్ పెట్టాలంటే పోర్టు పరిసరాలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో గ్రీన్‌బెల్ట్ పెంచాలని కోరారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజుకు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



