విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్
AP: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నం గాజువాక పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డే వేడుకల కోసం వచ్చిన స్నేహితుల్లో నీతూ, రాము అనే యువతి, యువకుడు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు తీస్తున్న సమయంలో నీతూ అలల్లో కొట్టుకుపోగా, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్‌ల వద్ద అలలు ఉధృతంగా ఉన్నందున సముద్ర తీరాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



