పని దొరికే చోటే ఇల్లు

TG: నిరుపేదలకు కేటాయించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాలకు దూరంగా కాకుండా, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండేలా నిర్మించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ORR పరిధిలో ప్రభుత్వ నిరుపయోగ స్థలాలను గుర్తించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.



