చదువులో ప్రతిభ చూపితే నగదు ప్రోత్సాహకం

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థులను సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ప్రోత్సహించారు. సోమవారం పాఠశాలలో ప్రభుత్వం అందించిన యూనిఫాం దుస్తులు, షూస్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. పదో తరగతిలో 550కుపైగా మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి తన సొంత నిధుల నుంచి రూ.10 వేల నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని ఆకుకూరల నర్సరీని ప్రారంభించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.




