← Back to news

AMUDA పరిధి విస్తరణపై జాయింట్ కలెక్టర్ హర్షం

By saraswathi rao· 29 Aug 2026· Ambedkar Konaseema
AMUDA పరిధి విస్తరణపై జాయింట్ కలెక్టర్ హర్షం

AP: కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AMUDA) పరిధి భారీగా విస్తరించడంపై జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. గతంలో 11 మండలాలు, 120 రెవెన్యూ గ్రామాలతో 896.16 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అముడా పరిధి, తాజా ఉత్తర్వులతో 14 మండలాలు, 176 రెవెన్యూ గ్రామాలు, 1,765.45 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. జీఓఎంఎస్‌ నం.203 ప్రకారం ఈ విస్తరణ జరిగిందని తెలిపారు.

More in Local