గన్‌తో బెదిరించి.. ATMను ఎత్తుకెళ్లిన ముఠా

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి దొంగలు SBI ATMను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏటీఎంను బొలెరో వాహనంలో తీసుకెళ్లిన దుండగులు, అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. దాంట్లో రూ.10 నుంచి రూ.13 లక్షల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. అనంతరం మిషన్‌ను మరో కంటైనర్‌లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలు, CC ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.



