ఎస్సైపై దళిత మహిళల ఫిర్యాదు

చిలకలూరిపేట నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐదుగురు దళిత మహిళలు సోమవారం విజయవాడ లోకాయుక్త కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన రాము పత్తి ఏరుకునేందుకు వెళ్లగా సంక్రాంతిపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. స్టేషన్‌లో మహిళా సిబ్బంది లేకుండానే అర్ధరాత్రి వరకు ఉంచి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఎస్సైపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.

