ఫస్ట్ Gen Z రూలర్ ఈమె

150 ఏళ్ల తర్వాత స్పెయిన్ మళ్లీ క్వీన్ పాలనలోకి వెళ్లబోతోంది. 2005 అక్టోబర్లో పుట్టిన 2౦ ఏళ్ల GenZ అమ్మాయి స్పెయిన్ దేశానికి త్వరలో కాబోయే క్వీన్. ఆమె పేరు ప్రిన్సెస్ లియోనోర్. ఫిలిప్ VI కూతురు. క్వీన్ ఇసాబెల్లా II తర్వాత ఆ దేశానికి క్వీన్ (ఉమెన్ రూలర్) అవుతున్నారు. లియోనోర్ రాయల్ రూల్స్ ప్రకారం మూడేళ్ల మిలిటరీ ట్రైనింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశారు. సోలోగా మిలిటరీ విమానాన్ని నడిపారు. ఆరుకి పైగా భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. త్వరలో సైన్యానికి తొలి ఉమెన్ సుప్రీం బాధ్యతలు తీసుకుంటారు.


