← Back to news

చిప్స్‌ తయారీ ఎందుకు?: రఘురామ్ రాజన్

By A.Ajay· 1h ago
చిప్స్‌ తయారీ ఎందుకు?: రఘురామ్ రాజన్

భారత్‌ భారీగా ఖర్చు చేసి సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తోందని RBI మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించారు. చిప్స్‌ చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాటిని సులభంగా స్మగ్లింగ్‌ చేయొచ్చని ఆయన చెప్పారు. చైనా, రష్యా ఇప్పటికే చిప్స్‌ను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నాయని అన్నారు. దేశంలో సెమీకండక్టర్‌ పరిశ్రమను డెవలప్ చేయడంపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై SMలో ట్రోలింగ్‌ మొదలైంది. రాకెట్లు, ఉపగ్రహాలు కూడా స్మగ్లింగ్‌ చేయొచ్చా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

More in Current Affairs