← Back to news

రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. ఐదుగురి మృతి

By Lokesh· 8 Sept 2026
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. ఐదుగురి మృతి

అమెజాన్‌కు చెందిన రవాణా విమానం మయామీ అరిపోర్టులో ప్రమాదానికి గురైంది. ప్యూర్టోరికోలోని సాన్‌జువాన్ నుంచి మయామీకి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న టైంలో రన్‌వే దాటి ముందుకు దూసుకెళ్లింది. మధ్యలో కొన్ని వాహనాలను ఢీకొట్టడంతో మంటలు వచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు ఫ్లైట్‌లో ఉన్నవారా, ఢీకొన్న వాహనాల్లో ఉన్నవారా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

More in International