భర్త మోసం చేశాడని.. టీచర్‌ను చెట్టుకు కట్టేసిన బాధితులు..

సంగారెడ్డి జిల్లా కల్గి మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న వసంతకుమారి భర్త, ఫైనాన్స్ పేరుతో గ్రామానికి చెందిన అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, భూతాలే వైద్యనాథ్, అవుటి బండ్యప్ప, కోటగిరి రాములు వద్ద డబ్బులు తీసుకొని మోసంచేసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు, మంగళవారం విధులకు వచ్చిన ఆమెను తాళ్లతో చెట్టుకు కట్టేసి అవమానించారు. అనంతరం గ్రామపెద్దల జోక్యంతో ఆమెను విడిచిపెట్టారు. ఈ విషయంపై బుధవారం వసంతకుమారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.



