← Back to news

రైలెక్కేలోపే నిందితురాలికి షాక్

By DK· 31 Jul 2026· కరీంనగర్ జిల్లా
రైలెక్కేలోపే నిందితురాలికి షాక్

TG: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రూ.26 లక్షల చోరీ కేసులో మరో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తగరం శంకర్‌ను నిన్న అరెస్ట్ చేయగా, ఆయన సన్నిహితురాలు ఆడెపు రేష్మాను తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చోరీ చేసినట్లు అంగీకరించింది. శంకర్‌తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్‌లో దాచిన రూ.26 లక్షల నగదును దొంగిలించినట్లు ఒప్పుకుంది. పరార్ అయ్యేందుకు రైలు కోసం వేచి ఉండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.