రజనీకాంత్ 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ క్యామియో!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక కీలకమైన క్యామియో (అతిథి పాత్ర)లోయాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడి పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ బాద్‌షా షాహ్రుఖ్ ఖాన్ ను అనుకున్నారు. అయితే ఆయన 'కింగ్' సినిమా కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేకపోయారు.



