← Back to news

రంగాపురం సమస్యలు పరిష్కరించాలి

By Ramesh Ch· 1h ago· Nallabelly, Nallabelli, Warangal
రంగాపురం సమస్యలు పరిష్కరించాలి

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని MCPIU మండల సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. సైడ్‌ కాల్వలు సరిగా లేక మురుగునీరు రోడ్లపైకి వస్తోందని తెలిపారు. పాత బావులు పూడుకుపోయాయని, గ్రామ పంచాయతీ అధికారి అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

More in Local