గ్లోబల్ అవార్డ్స్‌లో షాద్‌నగర్ విద్యార్థుల సత్తా

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన న్యూపవర్ కుంగ్‌ఫు అకాడమీ విద్యార్థులు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026లో ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్ర Amateur Sports and Cultural Awards Association ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. కరాటే, కుంగ్‌ఫు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. నాజ్మా బేగం, ఇషిక రెడ్డి, సునైనా బేగం, వేదాదిత్య, నాగ, దిక్షిత, దాన్షిక, తదితరులు Global Star Kids Icon Awards అందుకున్నారు.



