← Back to news

ఇళ్లలో మతప్రచారం.. ఆ దేశంలో నేరం

By Vishi· 19 Sept 2026
ఇళ్లలో మతప్రచారం.. ఆ దేశంలో నేరం

రష్యాలో 2016లో యరోవాయా చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇళ్లలో ప్రార్థనలకే తప్ప ఇతరులకు మతం గురించి చెప్పడానికి పర్మిషన్ ఉండదు. ఇతరుల్ని తమ మతంలోకి తీసుకురావాలని ప్రయత్నించడం నేరం. కుటుంబ సభ్యులు లేదా ఇప్పటికే ఆ మతంలో ఉన్నవారు కలిసి ప్రేయర్ చేసుకోవచ్చు. కానీ కొత్త వ్యక్తులను ఆకర్షించి, తమ మతంలోకి చేర్చుకోవాలని ప్రయత్నించడం కుదరదు. ఇళ్లను ‘మత ప్రచార కేంద్రాలు’గా మార్చకుండా ఉండటం కోసం ఈ చట్టాన్ని తెచ్చారు. ఇళ్లను మత భవనాలుగా మార్చడం కూడా ఆ దేశంలో నిషేధం.

More in International