ఎవరో అనుకొని అరెస్ట్ చేశారు.. తీరా ఆయనెవరో తెలిశాక!

అక్టోబర్ 10న దిల్లీలో జరిగిన నిరసనలో ఒక వృద్ధుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆర్థికవేత్త జీన్ డ్రెజ్. బెల్జియంలో పుట్టిన ఆయన భారత్‌కు వచ్చి పేదల కోసం జీవితమంతా అంకితం చేశారు. MGNREGA చట్టం రూపొందడంలో, పాఠశాలల్లో మిడ్‌డే మీల్ పథకం, ఆహార భద్రత చట్టం లాంటి వాటిలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ విషయం తెలిశాక పోలీసులు ఆయనను వదిలేయాలనుకున్నప్పుడు, ‘నాతోపాటు అదుపులోకి తీసుకున్న కూలీలను కూడా వదిలేసేదాకా నేను బయటకు రానని’ చెప్పారు.



