← Back to news

CMలో సైకో కన్పిస్తున్నాడు

By DK· 12 Jul 2026
CMలో సైకో కన్పిస్తున్నాడు

TG: రైతుల పంటపొలాల్లో నీళ్లు పారించండి అంటే మా రక్తాన్ని పారిస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. CM రేవంత్ రెడ్డిలో అధికారం కోల్పోబోతున్నామనే ఫ్రస్టేషన్ కనిపిస్తోందని అందుకే ప్రతిపక్షాల రక్తం పారించాలంటూ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. CM మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారన్నారు. హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకున్న రేవంత్ రెడ్డికి, షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్‌కు తేడా లేదన్నారు.

More in Politics